Quantcast
Channel: గ్రహభూమి
Viewing all articles
Browse latest Browse all 286

పంచాంగ పఠనంలో లేని అంశాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక

$
0
0
శ్రీ విజయ ఉగాది రోజున టి.డి.పి ఆఫీస్ లో నా పంచాంగ పఠనంలో లేని అంశాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనది.  ప్రపంచవ్యాప్తంగా నాకు 5 కోట్లమంది అభిమానులు ఉన్నారని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికలు అవాస్తవ కధనాలను ప్రచురిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఆంధ్రజ్యోతి 12 ఏప్రిల్ 2013 నాటి దినపత్రికలో ఇచ్చిన కధనంలో... చంద్రబాబు నాయుడు జన్మరాశి వృషభమని, ఆదాయ వ్యయాలు చెప్పినట్లుగా, సభలో ప్రముఖులు ముసి ముసి నవ్వులతో ఉన్నారనే కధనం ప్రచురితమైనది.
 

వాస్తవంగా నిన్నటి పంచాంగ పఠనంలో చంద్రబాబు నాయుడు పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ అవాస్తవ కధనాలు ప్రచురితమైనందున.... నా అభిమానులు తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు జన్మరాశి కర్కాటక రాశి కాని వృషభరాశి కానే కాదు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. దినపత్రికలో అవాస్తావ కధనం ప్రచురితమైనందున....... " గార్గేయ సిద్దాంతికి చంద్రబాబు జన్మ రాశికూడా తెలియదేమోనని అనుకునే రీతిలో ఆంధ్రజ్యోతి కధనమున్నది".  కనుక పాఠకులు ఈ దిగువన ఇచ్చిన పత్రిక కటింగ్ ను మరియు పూర్తి వీడియోను చూడగలరు. అవాస్తవ కధనాలను ప్రచురించిన కారణంగా నా ప్రతిష్ఠకు మరియు నా వృత్తికి భంగం వాటిల్లును. కనుక ఆంధ్రజ్యోతి యాజమాన్యం వారు ఈ విషయంలో పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పుకోనవలసి ఉండును. లేనిచో చట్టరీత్యా ఆంధ్రజ్యోతి దినపత్రికపై చర్య తీసుకొనబోతున్నాను. 


పంచాంగ పఠన వీడియోకి ఈ లింక్ ను క్లిక్ చేయండి.
http://grahabhumi.blogspot.in/2013/04/blog-post_1857.html 
 
- శ్రీనివాస గార్గేయ

Viewing all articles
Browse latest Browse all 286

Trending Articles