Quantcast
Channel: గ్రహభూమి
Viewing all articles
Browse latest Browse all 286

శ్రీ గణేశ చతుర్థి పూజా సమయాలు

$
0
0
స్వస్తిశ్రీ మన్మధ నామ సంవత్సర భాద్రపద శుక్ల చవితి శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన శ్రీ మహాగణపతిని పూజించవలసిన శాస్త్రీయ సమయాలు ఈ క్రింది విధముగా ఉండును.

భారతదేశంలో వారందరూ శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన ఉదయం 10 గంటల 49నిముషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 14నిముషాలమధ్య కాలంలో భక్తి, విశ్వాసాలతో గణపతి పూజ ఆచరించండి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లతో పాటు ఇతర దేశాలలో ఉన్నవారందరూ శ్రీ మహా గణపతిని ఉదయం 11గంటల 36నిముషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యకాలంలో పూజించి ఆరాధించండి.

ఇతర దేశాలలో ఈపర్వదినాన వృత్తి రీత్యా, ఉద్యోగ నిర్వహణలో ఉన్న వారందరూ సూర్యోదయం తదుపరి తొలి 1గంట 36 నిముషాలలోపూజ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అయితే మధ్యాహ్నం 11.36 నిముషాల నుంచి 2గంటలవరకు ఉన్న సమయంలో... వారు విధి నిర్వహణలో ఉన్నప్పటికీ మనఃస్పూర్తిగా శ్రీ మహా గణపతిని మనసులోనే మరొక్కసారి ధ్యానించుకోండి.


106 రోజులలో ఉన్న వ్యతిరేక అరిష్ట గ్రహస్థితుల ప్రభావం వాతావరణ, ప్రాకృతిక (భూకంప ఇత్యాదులు), రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక, సంగీత, సినిమా, రోడ్డు రైలు విమానయానములతో పాటు ద్వాదశ రాశులపై ప్రభావము ఉండును. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్య రంగములపైన ప్రభావముండును. ఇందుకు గాను ద్వాదశ రాశులవారు ఆచరించాల్సిన పరిహార వివరాలను సెప్టెంబర్ 18 శుక్రవారం ఋషిపంచమి పర్వదినాన పోస్టింగ్ చేయబడును. 

కనుక పరిహారములు చాలా సరళంగా ఉండటమే కాక అనవసర వ్యయముతో ఉండనే ఉండవు. ఈ పరిహారములలో భాగంగా కొంత భాగాన్ని ఎవరిపాటికి వారు ఆచరించుకుంటారు. కొంత భాగాన్ని మాత్రం ఎటువంటి రుసుము లేకుండానే మీ అందరి తరఫున మా పీఠంలో నేనే సంథాన కర్తగా ఉంటూ ప్రజాశ్రేయస్సుకై ఆచరించాల్సిన వైదిక క్రియను నిర్వహిస్తాను. 

ఇందు నిమిత్తమై మీ అందరి జన్మ నక్షత్ర వివరాలతో పాటు, పేరు, గోత్ర వివరాలను కూడా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. పూర్తి వీడియోను మీరు చక్కగా చూడగలరు. అభిమానులందరి పూర్తి వివరాలను తెలుసుకొనుటకై 18వ తేదిన ఈమెయిలు ఐడిని ఇవ్వగలను. దానికి మీ వివరాలను మెయిల్ చేయవచ్చు. 

ముఖ్య గమనిక ఏమిటంటే ఈ కార్యక్రమం నిర్వహణ కొరకై ఎవ్వరూ ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదని మరీ మరీ తెలియచేస్తున్నాను. - గార్గేయ సిద్ధాంతి

Viewing all articles
Browse latest Browse all 286

Trending Articles